9 August, 2026 | 3:25 PM

బాన్సువాడ పీఎస్ఆర్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బోనాల వేడుకలు

09-08-2026 02:14 PM

బాన్సువాడ, ఆగస్టు 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పిఎస్ఆర్ జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఆషాఢ మాసంలో భాగంగా ప్రతి ఏడాది సామూహికంగా జరిపే ఈ వేడుకల్లో కాలనీ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, తలపై బోనాలు పెట్టుకుని డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో ఊరేగింపుగా వెళ్లారు. 

డబుల్ బెడ్ రూం ల వద్ద ఉన్న పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో సుఖసంతోషాలు, వర్షాలు కురవాలని మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలతో పాటు జర్నలిస్టులు సాయగౌడ్, సుభాష్,  రాజేశ్వర్ రెడ్డి, గోపాల్, శ్రీనివాస్, పోషీరామ్, చంద్రశేఖర్ , మధుసూదన్ రెడ్డి, పంతులు నరేష్, నరేష్ గౌడ్, ప్రచేతన్, దండు విజయ్, సుధాకర్ గౌడ్, నరహరి లక్ష్మణ్, సుధీర్, మల్లికార్జున్, అరుణ్ రెడ్డి, వంశీ తదితరుల కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.