9 August, 2026 | 4:14 PM

కేటీఆర్ ప్రజలే నీకు 'జల సమాధి' కడ్తరు: ఎంపీ చామల

09-08-2026 03:16 PM

హైదరాబాద్: జల ఉద్యమం(Water Movement) చేస్తానని కేటీఆర్ అంటున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. తెలంగాణ ప్రజలే నిన్ను, బీఆర్ఎస్ పార్టీని జల సమాధి చేశారని విమర్శించారు. జీఆర్ఎంబీ మీటింగ్(GRMB Meeting) ఏపీ ప్రభుత్వం పెట్టిందని తెలిపారు. జీఆర్ఎంబీ మీటింగ్ కు వెళ్లి ఏపీ ప్రతిపాదనలను వ్యతిరేకించాలా వద్దా?, కేసీఆర్ రాయలసీమ వెళ్లి రోజా ఇంట్లో చేపల పులుసు తినలేదా?, రాయలసీమను రతనాల సీమ చేస్తామని కేసీఆర్ అనలేదా? అని కాంగ్రెస్ ఎంపీ చామల ప్రశ్నించారు.

జగన్ ను ప్రజాభవన్ కు పిలిచి కేసీఆర్ బిర్యానీ పెట్టారని గుర్తుచేశారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని జగన్ తో కేసీఆర్ అన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి కి చంద్రబాబుతో అవగాహన ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని  బీఆర్ఎస్ చూస్తోందని ధ్వజమెత్తారు.  ప్రభుత్వానికి ఆదాయం తేవాలనే సీఎం రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ తెచ్చారని సూచించారు.

''తెలంగాణ ప్రజలు ఇప్పటికే BRS పార్టీకి స్పష్టమైన రాజకీయ తీర్పునిచ్చారు. కృష్ణా జలాల్లో తక్కువ వాటాను అంగీకరించి, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన తర్వాత, నీటి హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు KTRకి అస్సలు లేదు. KCR కుటుంబానికి కేవలం 'ఎన్నికలు, వసూళ్ల' (elections and collections) మీద మాత్రమే ధ్యాస. HYDRAA, ప్రభుత్వ పనితీరుపై మీ అనవసర విమర్శలను ఆపండి. మీరు చేసిన నష్టాన్ని సరిదిద్దడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది.'' అని ఎంపీ చామల ఎక్స్ లో పోస్టు చేశారు.