7 August, 2026 | 9:48 PM

త్రివేణి పాఠశాలలో బోనాల సంబరం

07-08-2026 08:29 PM

పాల్వంచ,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణంలోని త్రివేణి పాఠశాలలో శుక్రవారం అంగరంగ వైభవంగా ఆషాడమాస బోనాల సంబరాలు నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రాంగణాన్ని మామిడి తోరణాలతో, వేపాకులతో, పూల రంగవల్లులతో అందంగా తీర్చిదిద్ది అమ్మవారిని  చిన్నారి విద్యార్థుల బోనం కుండలతో ఘనంగా పాఠశాలలోకి స్వాగతం పలికారు.

పూజాది కాలు నిర్వహించి  పలురకాల నైవేద్యాలు పెట్టి ఘన హారతిని ఇచ్చి అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, యావత్ భారతదేశం చల్లగా సుభిక్షితంగా ఉండాలని కోరారు. అనంతరం చిన్నారి బాల బాలికల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్లు, సి ఆర్ వో అమ్మవారి దయ అందరి పైన ఉండాలని విద్యార్థులందరికీ మంచి ఆరోగ్యాన్ని, విద్యను  ప్రసాదించమని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, కిడ్స్ఇంచార్జ్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.