19 May, 2026 | 3:20 AM

మున్నూరు కాపు సామాజిక అభివృద్ధికి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పని చేయాలి

19-05-2026 12:06 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ముకరంపుర, మే 18 (విజయ క్రాంతి): మున్నూరు కాపు సామాజిక అభివృద్ధికి  బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పని చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఇందిరా గార్డెన్లో అభినందన సభ నిర్వహించారు.  మంత్రు లు పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్ కు మార్, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఘనంగా సన్మానించారు. అంతకుముందు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల నాయకత్వం మరింత పటిష్ఠంగా ఉండేలా బొమ్మ శ్రీరామ్ కి జిల్లాలో మంచి అవకాశం వచ్చిందన్నారు. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నాయకత్వాన్ని బలపరచడానికి మున్నూరు కాపు నాయకాలంతా సహకరించారన్నారు. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో మున్నూరు కాపు సోద రులకు సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా కార్యక్రమాలు చేపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్, డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోడూ రి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్, కర్ర రాజశేఖర్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లాలో 50 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

కరీంనగర్, మే 18 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని, వచ్చేవారం లక్ష మెట్రిక్ టన్నుల  కొనుగోళ్లు లక్ష్యంగా నిర్దేశించామని, ఇప్పటి వరకు రైతులకు 237 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనా రాయణ, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సీజన్లో 3.61 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామని అన్నారు. ధాన్యం లోడు పూర్తయిన ప్రతి వాహనం 24 గంటల్లోగా మిల్లులో అన్లోడ్ అయ్యేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తనీయవద్దని అన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, పౌరసరఫరాల సంస్థ డిఎం రజనీకాంత్, రైస్ మిల్లులు, ట్రాన్స్పోర్ట్ అసోసి యేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.