20 May, 2026 | 4:51 AM

జడ్చర్ల బస్ స్టాండ్‌లో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్

20-05-2026 12:22 AM
  1. హర్యానా అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్
  2. విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు 

జడ్చర్ల, మే19 : హర్యాన రాష్ట్రానికి సంబంధించిన దోపిడి  ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జడ్చర్లలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతర్రాష్ట్ర కి సంబంధించిన దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేసినట్లు వివరించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన 6 మంది సభ్యుల ప్రొఫెషనల్ బ్యాగ్ లిఫ్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి భారీగా బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డ్రైవర్ సచిన్ కియా కరెన్స్ HR16AB6156 కారును బస్ స్టాండ్కు దూరంగా సిద్ధంగా ఉంచుతాడు.

మిగిలిన ఐదుగురు రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణికుల్లా ఎక్కుతారు. ఒంటరి మహిళలు లేదా బ్యాగుల్లో బంగారం ఉన్నవారిని టార్గెట్ చేసి, వారి చుట్టూ చేరి నెట్టుకుంటూ హడావిడి చేస్తూ దృష్టి మరలుస్తారు. అదే సమయంలో ముఠా లీడర్ సందీప్ లేదా అశోక్ తన వద్ద ఉన్న షార్ప్నర్ కత్తితో బ్యాగులను కోసి లేదా జిప్ తీసి క్షణాల్లో బంగారాన్ని దొంగిలించి, బస్సు కదులుతుండగానే దిగిపోయి కారులో పారిపోతారు.ఈ నెల 7 న నేతాజీ చౌరస్తా వద్ద పండ్లు కొంటున్న మహిళను వెంబడించి బస్సెక్కాక బ్యాగులోని బంగారం దొంగిలించి కర్నూల్ వైపు పారిపోయారు.ఈ నెల 18 న బస్ స్టాండ్ వద్ద ఆటోలో వచ్చిన ప్రయాణికులను వెంబడించి బస్సెక్కాక ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో బ్యాగు కట్ చేసి నగలు దొంగిలించారు.

కర్నూల్ లాడ్జిలో తలదాచుకున్న ముఠా సోమవారం ఉదయం 8 గంటలకు మళ్లీ దొంగతనానికి జడ్చర్ల బస్ స్టాండ్కు వచ్చారు. అదే సమయంలో వాహన తనిఖీలు చేస్తున్న ఎస్‌ఐ కె. మల్లేష్ బృందం వీరిని చూసింది. పారిపోడానికి ప్రయత్నించిన ఆరుగురిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.కారు HR16AB6156,10 తులాల బంగారం. అందులో 2 నెక్లెస్లు,7 జతల కమ్మలు,1 ముక్కు పుడక,3 లాకెట్లు,6 పట్టీలు, 3 ఉంగరాలు ఉన్నాయి.ముఠా నాయకుడు సందీప్ పాత నేరస్తుడు.

2017 నుంచి 2019 మధ్య ఆదిలాబాద్, హైదరాబాద్లో 15 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. హర్యానాలోని బంధువులతో కలిసి ఈ ముఠాను తయారు చేశాడు. దీపక్ అనే వ్యక్తి వద్ద నుంచి కారు తీసుకొని మే 2026 మొదటి వారంలో తెలంగాణకు వచ్చారు.నిందితులను రిమాండ్కు తరలించారు. పట్టుకున్న ఎస్‌ఐ కె. మల్లేష్, పీసీ విష్ణుమూర్తి, పీసీ నరసింహ రాజుని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశం జడ్చర్ల ఇన్స్పెక్టర్ కమలాకర్, తదితరులు ఉన్నారు.