5 August, 2026 | 1:39 AM

సిద్దాపూర్ డంపింగ్ యార్డుపై ఢిల్లీలో బీజేపీ పోరాటం

05-08-2026 12:44 AM

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ డీకే అరుణ

రంగారెడ్డి, అగస్టు 4 (విజయక్రాంతి): సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయాలంటూ బీజేపీ చేపట్టిన పోరాటానికి కేంద్ర స్థాయిలో మద్దతు లభిస్తోంది. స్థానిక బీజేపీ నాయకు లు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబన్నల విజ్ఞప్తి మేరకు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జ లాలు కలుషితమై, ప్రజల ఆరోగ్యం మరి యు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.