మహిళా బిల్లు వెనుక బీజేపీ కుటిల రాజకీయం
డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): దేశాన్ని విభజించి పాలించాలనే దుర్బుద్ధితోనే భాజపా ఇటువంటి చౌకబారు రాజకీ యాలకు పాల్పడుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం అర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియాతో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసేలా డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని, కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే వారి అసలు లక్ష్యమని ఆరోపించారు.
భాజపా చేస్తున్న ఈ అన్యాయాన్ని తమ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీవ్రం గా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న బీజేపీ కుట్రలను ప్రజలు ముఖ్యంగా మహిళాలోకం గమనించాలని కోరారు. 12 సంవత్సరాలుగా పార్ల మెంటులో ఏబిల్లు వీగిపోలేదని మహిళాబిల్లు విషయంలో కుట్ర జరిగిందని, ఇప్పటికైనా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించాలని, సోమవారం మళ్లీ కేవలం మహిళా బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తగుల పెట్టాల్సింది ఇండియా కూటమి దిష్టి బొమ్మలు కాదని మహిళా బిల్లు పట్ల కుట్రలకు పాల్పడ్డందుకు బీజేపీ నాయకుల దిష్టి బొమ్మలనే తగల బెట్టాలని నరేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక సమస్యలను గాలికొదిలేసి కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ది చేకూరే విధంగా డిలిమిటేషన్ బిల్లు పెడితే దాన్ని మీరు సమర్థిస్తే భవిష్యత్ తరాలు మిమ్ములను క్షమించవని అన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కరీంనగర్ కా ర్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజ శేఖర్, పిట్టల రవీందర్, కార్పోరేటర్లు మల్లిఖార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, కాంతాల జగన్ రెడ్డి, పర్వతం మల్లేశం, గుమ్మడి రాజ్ కుమార్ నాయకులు టేల భూమయ్య, ఇక్రమ్, దండి రవీందర్, పెద్దిగారి తిరుపతి, మాసుం ఖాన్, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.






