వేయి స్తంభాల గుడి అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులవి ప్రగల్భాలే..!
అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే- బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మా
వెయ్యి స్థంబాల ఆలయంలో చేపట్టనున్న అభివృధి పనులు పరిశీలించిన బిజెపి బృందం.
హనుమకొండ,(విజయక్రాంతి): చారిత్రాత్మక దేవాలయమైన వెయ్యిస్తంభాల గుడి (రుద్రేశ్వరాలయం) పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం విడత చేసిన భారీ నిధుల పట్ల బిజెపి రాష్ట్ర నాయకురాలు రావు పద్మ హర్షం వ్యక్తం చేశారు. వేయి స్తంభాల గుడిలో గురువారం బీజేపీ జిల్లా నాయకులతో కలిసి పునరుద్ధరణ పనులను పరిశీలించిన అనంతరం రావు పద్మా మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి అసంపూర్తిగా ఉన్న వెయ్యిస్తంభాల గుడి కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారని,గతంలో పురావస్తు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూపాయలు 17 కోట్లు కేటాయించి, పనులను పూర్తి చేయించి జాతికి అంకితం ఇచ్చారన్నారు.
గత ఏడాది హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి ని కలిసి ఆలయంలోని మరికొన్ని అసంపూర్తి పనులను వారి దృష్టికి తీసుకువెళ్లాడం జరిగిందని, ఇటీవల కిషన్ రెడ్డి హనుమకొండ పర్యటనకు వచ్చినప్పుడు ఆలయ ప్రాంగణంలో సమీక్ష నిర్వహించి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి ప్రతిపాదనలు పంపారని,అందుకు స్పందించిన కేంద్రం, ఆలయ అభివృద్ధి పనుల కోసం రూపాయలు 14.44 కోట్లు, కామేశ్వరాలయ పునర్నిర్మాణానికి రూపాయలు 6.86 కోట్లు మంజూరు చేసిందని,20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఓరుగల్లు వారసత్వాన్ని కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ కి, కిషన్ రెడ్డి కి, గజేంద్ర సింగ్ షెకావత్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. "పెళ్లైన, చావైన నేనే డాన్స్ వేస్తా అన్నట్లుగా ప్రతి చిన్న విషయానికి క్రెడిట్ కొట్టేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని,గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైనా, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనైనా అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అన్నది వాస్తవంఅని,రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలు మానుకుని, కేంద్రం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేయాలి," అని ఆమె హితవు పలికారు. కాకతీయుల అద్భుత శిల్పకళను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని రావు పద్మా ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమాలలో బిజెపి రాష్ట్ర నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, పులి సర్రొత్తం రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు, జిల్లా నాయకులు బైరి శ్రావణ్ కుమార్, తోపుచేర్ల అర్చన మధుసూదన్ రావు, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, బొమ్మసాని అనిల్, జరీనా, కేతిపల్లి సంపత్ రెడ్డి, లక్ష్మీ రత్నా, డివిజన్ అధ్యక్షులు ఉడుతల మురళీ, కొల్లూరి కల్యాణ్, కస్తూరి నవీన్, ఉషా రెడ్డి, హనుమండ్ల తిరుపతి రెడ్డి, బాల్నే రేవంత్, గొర్రె ఓంప్రకాష్ యాదవ్ , నాసం కరుణ, కవిత, తదితరులు పాల్గొన్నారు.




