ఉట్నూర్‌లో బీజేపీ నిరసన
18-04-2026 07:28 PM
ఉట్నూర్ లో నిరసన వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న బిజెపి నాయకులు
ఉట్నూర్,(విజయక్రాంతి): మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బిజెపి నాయకులు ఉట్నూరులో శనివారం ఆందోళన చేపట్టారు. ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా మహిళల పట్ల వారి వైఖరి బయటపడిందని విమర్శించారు. దేశంలోని మహిళలు బిజెపికి మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్ విభజన బిల్లులు భవిష్యత్తులో అమలులోకి వస్తాయని ఆయన అన్నారు.






