కాంగ్రెస్ ఇచ్చిన హామీల వాల్‌పోస్టర్లు విడుదల చేసిన బీజేపీ నాయకులు
బాన్సువాడ, ఆగస్టు 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోసం చేసిన హామీలను ప్రజలకు తెలియజేయడానికి వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో 6 గ్యారంటీలు.
420 హామీలు ఎన్నికలులో చెప్పి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ప్రజలను యువతను విద్యార్థులను మోసం చేసి ఈరోజు అధికారంలో రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లో విడుదల చేస్తామని. యువతకు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ పెడతామని. రైతులకు రుణమాఫీ చేస్తామని బోనస్ లు ఇస్తామని అటు రైతులు మోసం చేస్తూ యువతకు జాబులు ఇస్తామని చెప్పి యువత మోసం చేస్తూ విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేసి ఉన్నత విద్యకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారులకు రాగానే ఇవన్నీ మర్చిపోయి విద్యార్థులు యువకులు ప్రభుత్వాన్ని నిర్మిస్తే వాళ్లపైన కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది
కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని. లేనిచో ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని. అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి కౌన్సిలర్ గజ్జల మహేష్ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్ బీజేపీ నాయకులు పాశం భాస్కర్ రెడ్డి శ్యామల శ్రీకాంత్ మహేందర్ పురుషోత్తం సచిన్ సందీప్ సాయి రెడ్డి భూమేష్ తదితరులు పాల్గొన్నారు.






