20 August, 2026 | 3:02 AM

‘దాశరథి కవితాఝరి’ పుస్తకావిష్కరణ

20-08-2026 01:23 AM

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): లక్డీకాపూల్‌లోని ఐఐఎంసీ కళాశా లలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో డా. తిరునగరి శరత్ చంద్ర సంకలనపరిచిన ‘దాశరథి కవితాఝరి’ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. మహాకవి దాశరథి 1985, 1986, 1987 సంవత్సరాల్లో తన డైరీలో రాసుకున్న అముద్రిత కవితలను సంకలనంగా రూపొందించి ఐఐఎంసీ ఆరో ప్రచురణగా తీసుకొచ్చారు.

ఐఐఎంసీ తెలుగు శాఖ అధ్యక్షులు ఇ. రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కన్నీ ళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలనపై కవితాయుధాలను ఎక్కుపెట్టిన ప్రజాకవి దాశరథి అముద్రిత కవితల్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని అన్నారు. కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ.. దాశరథితో తనకున్న అనుబంధా న్ని గుర్తుచేసుకున్నారు.

ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ మాట్లాడుతూ.. మరుగున పడుతున్న సాహితీవేత్తలు, ప్రముఖ వ్యక్తుల పుస్తకాలను, విలువైన సాహిత్య సమాచారాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో పుస్తక ప్రచురణలను ప్రారంభించామని తెలిపారు. ముఖ్య అతిథి ఉస్మాని యా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి ‘దాశరథి కవితాఝరి’ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతు లను దాశరథి కుమార్తె ఇందిర, కుమారుడు లక్ష్మణ్‌కు అందజేశారు.

తెలుగు విశ్వవిద్యాల యం పూర్వ రిజిస్ట్రార్ టి. గౌరీ శంకర్ దాశరథితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకు న్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు దాశరథిని మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర గ్రం థాలయ పరిషత్ పూర్వ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ దాశరథితో తనకున్న ప్రత్యక్ష అనుబంధాన్ని పంచుకున్నారు. సంకలనకర్త, నిజాం కళాశాల తెలుగు అధ్యాపకులు, సినీ కవి డా. తిరునగరి శరత్ చంద్ర, దాశరథి అల్లుడు గౌరీ శంకర్,  దాశరథి కుమార్తె ఇందిర, కు మారుడు లక్ష్మణ్, కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం, సంస్కృత విభాగం సహాయాచార్యులు మాధవి పాల్గొన్నారు.