ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వైభవం
- రికార్డు స్థాయిలో710 అడ్మిషన్లు
- ఫలించిన ప్రొఫెసర్ల ప్రయత్నం
- కొత్త కోర్సులకు ట్రెండ్
నిర్మల్,ఆగస్టు 19(విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబడుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం వ చ్చింది. కళాశాల ప్రొఫెసర్ల శ్రమ, నాణ్యమైన విద్యాబోధన, ప్రభుత్వ విద్యపై విద్యార్థుల్లో నమ్మకం కలగడంతో ఈ సంవత్సరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు స్థాయిలో 710 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందా రు.. తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియం మూ డు విభాగాల్లో డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నా రు.. బీకాం బీఎస్సీ అనుబంధ కోర్సులతోపాటు కొత్తగా బ్యాంకింగ్ సర్వీస్, ఏఐ టె క్నాలజీ కోర్సులను ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమలు చేస్తుంది. 19 71లో ప్రారంభమైన ఈ డిగ్రీ కళాశాలలో 10 ఏళ్ల క్రితం వరకు బాగానే అడ్మిషన్లు వచ్చేవి.
ఆ తర్వాత జిల్లాలో ప్రవేట్ డిగ్రీ కళాశాలలో రావడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అ యితే ఈసారి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ అధ్యాపకులు ప్రొఫెసర్లు ఉద్యోగులు అడ్మిషన్లకు ముందే దోస్త్ అప్లికేష్ప విస్తృతంగా అవగాహన కల్పించి గ్రామీ ణ పేద మధ్యతరగతి పిల్లలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువు యొక్క ప్రాధాన్యతను వివరించారు.
ఫలించిన ప్రయత్నం
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పూర్వపు డిగ్రీ కళాశాలలో నిర్మల్ డిగ్రీ కళాశాల ఒకటి. 19 71లో ఈ కళాశాలలు స్థాపించారు. అదిలాబాద్ మంచిర్యాల జిల్లాతో పాటు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయగా ఇక్కడ గతంలో ఎంతో మంది విద్యార్థులు అడ్మిషన్లు పొంది నాణ్యమైన చదువులు అ భ్యసించి ఉద్యోగాలు కూడా సాధించారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో3 ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో ఉండగా నిర్మల్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్త్ అప్లికేషన్ ద్వారా 710 మంది విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్నారు.
ప్రిన్సిపల్ సుధాకర్ తో పాటు కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు మొత్తం 27 మంది, ఇతర సిబ్బంది పూర్వ విద్యార్థుల సహకారంతో దోస్త్ అప్లికేషన్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్న వారికి అమలు చేస్తున్న విద్యా బోధన ఎన్‌ఎస్‌ఎస్, ఎన్సిసి, ఉండడం తో కళాశాలలో చేరాలని ప్రొఫెసర్లు జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ ఛాంపియన్ నిర్వహించారు. జూన్ మాసం నుండి ఇంటర్ పాసైన విద్యార్థుల ఇంటికి వెళ్లి డిగ్రీలు దోస్త్ అప్లికేషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పెట్టుకునే విధంగా ప్రోత్సహించారు.
ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చేరడం వల్ల విద్యార్థి నష్టపోయే విధానాన్ని వివరించారు. సుమారు 13 ఎకరాల సొంత భవనం, విశాలమైన గదులు, డిజిటల్ క్లాసులు, ప్రయోగ సామాగ్రి, పోటీ పరీక్షల్లో నైపుణ్యత, ఎన్‌ఎస్‌ఎస్ ఎన్సిసి కార్యక్రమాలు, పోటీ పరీక్షలకు దీటుగా విద్య బోధన విద్యార్థులకు వివరించారు. దీంతో ఈ సంవత్సరం ప్రథమ సంవత్సరంలో తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మూడు మీడియంలో 70 మంది విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. కళాశాల ప్రారంభించి 55 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ స్థాయిలో అడ్మిషన్లు తీసుకోవడం ఇదే మొదటిసారి అని కళాశాల సిబ్బంది చెప్తున్నారు.
పోటీ పరీక్షలపై ప్రత్యేక దృష్టి
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరిన విద్యార్థులకు విద్యుత్తు పాటు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఏ రంగంలో స్థిరపడాలో ఆ ఛాయస్లను విద్యార్థులకు వివరిస్తూ పోటీ పరీక్షలకు తట్టుకునేలా విజ్ఞానా న్ని అందిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ఎన్సిసి శిక్షణ ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు వ స్తున్నాయి. ఈ కళాశాలలో మొత్తం 27 మం ది ప్రొఫెసర్లు అనుభవజ్ఞులు నిర్మల్ చెందినవారే ఎక్కువగా ఉండటంతో కళాశాల పూర్వ విద్యార్థులు కావడం కూడా ఈ కళాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కళాశాలలో ప్రతిరోజు క్రీడలు ఇతర సామాజిక అంశాలను నేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అడ్మిషన్ల సంఖ్య తిరిగినట్టు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులకు డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టి ఈ సంవత్సరం బ్యాంకింగ్ కోర్సులను అమలు చేస్తున్నారు ఇందులో ఇప్పటికే180 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఉద్యోగ కెరీర్ గౌడ్ పై హైదరాబాద్ చెందిన నిపుణులతో అవగాహన కార్యక్రమాలు కొత్త టెక్నాలజీ పై విస్తృతంగా అవగాహన కల్పించడం తో పేద విద్యార్థులు ఈ కళాశాలలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఇదే కళాశాలలో చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారితో ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసి వారి అనుభవాలను తోటి విద్యార్థులకు చెప్పిస్తున్నారు.
రికార్డ్ స్థాయిలో అడ్మిషన్లు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇప్పటికీ 710 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం దోస్త్ అప్లికేషన్ ద్వారా ప్రవేశం పొందారు. 1971 నుండి ఇప్పటివరకు ఈ స్థాయిలో అడ్మిషన్లు రావడం ఇదే మొదటిసారి. కళాశాలలో డిజిటల్ విద్యా విద్యా బోధన, అనుభవగులైన అధ్యాపకులు. నాణ్యమైన విద్యుత్ తో పాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే స్టడీని అందించడం వలన కళాశాలలో అడ్మిషన్లు పెరిగినాయి. సొంత భవనం విశాలమైన, విశాలమైన తరగతి గదులు, ఆధునిక ల్యాబ్ టెక్నీషియన్, ట్రేడింగ్ కోర్సులు ఉండటం వలన ఇది సాధ్యం అయింది.
సుధాకర్ ప్రిన్సిపాల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల






