బీఆర్‌ఎస్ నేత రేగాకు ఊరట
20-08-2026 12:32 AM
సాక్ష్యాధారాలు లేవని వేధింపుల కేసును కొట్టేసిన హైకోర్టు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19 (విజయక్రాం తి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు భారీ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ హైకోర్టు కేసును బుధవారం కొట్టేసింది. తనపై తప్పుడు కేసు నమో దు చేశారన్న రేగా కాంతారావు వాదనతో ఉన్న త న్యాయస్థానం ఏకీభవిం చింది. పోలీసు లు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు క్వా ష్ చేయడంతో రేగా కాంతారావుపై ఆరోపించబడిన ఆరోపణలు నిరాధారనమైనవి కావడంతో ఆయనకు భారీ ఊరట లభించింది.






