సురక్షిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జిల్లా ఎస్పీ నర్సింహ
కోదాడ, ఆగస్టు 19: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ నర్సింహ కోరారు. బుధవారం కోదాడలోని కాశీనాదం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సురక్షిత వాహనం, నా ఆటో సురక్షితం అనే అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ ఆటోలకు, డ్రైవర్లకు క్యూఆర్ కోడ్లు అందజేశారు.
మై ఆటో ఇస్ సేఫ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్ ను అందించామని దీని ద్వారా ఎవరైనా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు అనుకోని ఇబ్బందులకు గురైనట్లయితే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ యొక్క స్థితిగతులను, ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పోలీసు వారికి తెలియజేసే అవకాశం ఉందని దీని ద్వారా మీరు మరింత భద్రంగా ఉంటారు అని, దీనిలో భద్రతా పరంగా టీ సేఫ్ అనే యాప్ కూడా ఉన్నది అన్నారు.
క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కినట్లయితే క్యూఆర్ కోడ్ ప్రొవైడర్ ద్వారా సంబంధిత పోలీసు వారికి సమాచారం చేరి పోలీస్ వారు అలర్ట్ అవుతారు మీకు రక్షణ కల్పిస్తారని అన్నారు. భద్రత పరమైన సాంకేతికతను అందించిన యాప్ నిర్వాహకులు రమేష్ రెడ్డి నీ ఎస్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్, మై ఆటో ఇస్ సేఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ రెడ్డి, ఎస్త్స్ర అంజి రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.






