20 August, 2026 | 2:18 AM

ఈ మారుతిది ట్రెండీ లవ్‌స్టోరీ!

20-08-2026 01:24 AM

యంగ్ హీరో సంగీత్ శోభన్, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని, డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. ట్రెండీ లవ్‌స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బుధవారం కథానాయకుడు సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మారుతి అనే పాత్రలో నటిస్తున్న సంగీత్ శోభన్.. మిడిల్ క్లాస్ అబ్బాయి లుక్‌లో ఉన్నాడు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 23న రా నుంది. 

‘సాహో’ ఏడీతో మిస్టరీ థ్రిల్లర్ కామెడీ 

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో వస్తున్నారు. ఈ సినిమాలో యువ హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్‌లో నటించనున్నారు. ప్రణయ్‌రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన ‘సాహో’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేయడంతోపాటు ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు అడిషినల్ స్క్రీన్‌ప్లే వర్క్ చేశారు. సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును మేకర్స్ ప్రకటించారు.

మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ కీలకంగా ఉండనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.