వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ నేతల నివాళులు
16-08-2026 03:08 PM
భిక్కనూర్, ఆగస్టు 16(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు, మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా భిక్కనూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు ఉపరి రమేశ్ ఆధ్వర్యంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు అత్తెల్లి తిరుమలేశ్, పొన్నాల రంజిత్‌కుమార్, ఉపాధ్యక్షులు నరేందర్‌రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ లింగారెడ్డి, మహేందర్‌రెడ్డి, పుట్నాల పవన్, సందీప్, హరీష్, డప్పు శీను, సాయిరెడ్డి, రాజిరెడ్డి, సాము మహేందర్‌రెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






