16 August, 2026 | 6:21 PM

రేపటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

16-08-2026 05:56 PM

జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు: కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను మరింత సులభంగా పరిష్కరించేందుకు రేపు ఆగస్టు 17వ తేదీ నుంచి మండల స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను సంబంధిత అధికారులకు నేరుగా సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలోనే నిర్వహిస్తున్నందున, తమ సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

మండల ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో సమర్పించాలని కోరారు.