18 August, 2026 | 1:17 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

జాతీయ జెండాకు అవమానం జరిగిందని బీజేపీ నేతల ఫిర్యాదు

18-08-2026 12:00 AM

ఆదిభట్ల, ఆగస్టు 17 ( విజయ క్రాంతి ): ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ కమ్మగూడలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ పార్టీ 53, 56 డివిజన్ల అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి,బీజేపీ నాయకులు కొంత రాంరెడ్డి బచ్చిగల రమేష్ కొత్త ఈ మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ జాతీయ త్రివర్ణ పతాకానికి బదులుగా ఆకుపచ్చ జెండాతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారని ఆరోపించారు.పాఠశాలలో రోజువారీ కార్యక్రమాల్లో వందేమాతరం బోధించడం లేదని పేర్కొన్నారు.ఈ ఘటనపై అధికారికంగా విచారణ జరపాలని అధికారులను కోరారు.పాఠశాలలో జాతీయ జెండా వినియోగంపై ఫ్లాగ్ కోడ్ నిబంధనలు పాటిస్తున్నారో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు గుండ కృష్ణ, నందగిరి సురేష్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.