18 August, 2026 | 1:16 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

నాగోల్ బోనాలకు మౌలిక వసతుల ఏర్పాట్లు

18-08-2026 12:00 AM

భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలి

నాగోల్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): నాగోలు చెరువు పరిసరాల్లో ఈ నెల 24 నుంచి జరగనున్న బోనాల ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య, మౌ లిక వసతుల ఏర్పాట్లు చేపట్టాలని నాగోల్ ఆలయ కమి టీ ప్రతినిధులు జోనల్ కమిషనర్ వికాస్ మహతోను కలిసి వినతిపత్రం అందజేశారు. చెరువు పరిసరాలు, ఆలయాల వద్ద చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, మురుగు తొలగించడంతో పాటు వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఉత్సవాల సమయంలో ప్రత్యేక పారిశుధ్య బృందాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కమిషనర్ను సన్మానించి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ శ్రీశ్రీ పోచమ్మ దేవాలయం అధ్యక్షులు చింతల సురేందర్ యాదవ్, మహంకాళి దేవాలయం అధ్యక్షులు బద్దం మహేందర్ గౌడ్, వస్పరి మల్లేష్, డప్పు రాజు, రావుల శ్రీనివాస్ గౌడ్, మైనం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.