ఓట్ చోరీ, సీట్ చోరీ చేసేది కాంగ్రెస్సే: రామచందర్‌రావు
కాంగ్రెస్ ఎప్పుడు గెలిచినా.. బోగస్ ఓట్లతోనే
సీట్ చోరీ చేసి నెహ్రూ, ఇందిర ప్రధానులయ్యారు.
హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో Special Intensive Revision (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఖండించారు. సీఈసీ విషయంలో కాంగ్రెస్ ఆరోపణలు సరికావని ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. సీఈసీలకు గతంలో కాంగ్రెస్ పార్టీ పద్మ పురస్కారాలు ఇచ్చిందని పేర్కొన్నారు. రిటైర్డ్ సీఈసీలకు ఎన్డీయే ప్రభుత్వం ఎలాంటి పదవులు ఇవ్వలేదని చెప్పారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ గతంలో 12 సార్లు జరిగిందని వెల్లడించారు. కాంగ్రెస్ ఎప్పుడు గెలిచినా.. బోగస్ ఓట్లతోనే గెలిచిందని ఆరోపించారు. ఎస్ఐఆర్ లో ప్రతిపార్టీ బీఎల్ఏ-2 నియమించుకుంటుందని రామచందర్ రావు పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే ఆయా పార్టీల బీఎల్ఏ2లు వెంటనే చెప్తారని వివరించారు. ఎస్ఐఆర్ లో దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారని రామచందర్ రావు వెల్లడించారు. ఎస్ఐఆర్ తో బీజేపీకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
SIR, మీనాక్షి నటరాజన్ వివాదంపై టీబీజేపీ చీఫ్ ఆగ్రహం
ఎస్ఐఆర్, మీనాక్షి నటరాజన్ వివాదంపై టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ వల్ల ఓట్లు తొలగిస్తే కేరళంలో యూడీఎఫ్ ఎలా గెలిచింది? అని ప్రశ్నించారు. తెలంగాణలో పాక్, బంగ్లాదేశ్ వారికి ఓట్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ చోరీ, సీట్ చోరీ చేసేది కాంగ్రెస్సేనని రాంచందర్ రావు ధ్వజమెత్తారు. సీట్ చోరీ చేసి నెహ్రూ, ఇందిర ప్రధాన మంత్రులయ్యారని ఆరోపించారు. పౌరసత్వం రాకముందే సోనియా గాంధీ ఓటు వేశారని వెల్లడించారు.






