31 March, 2026 | 6:41 PM

ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్

31-03-2026 05:25 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు లింగాల శంకర్ మంగళవారం ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి ఘనంగా సన్మానించారు. మండలంలో పార్టీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.