మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వదల్పర్తి గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల వారీగా మహిళా సంఘాలకు నూతన భవన నిర్మాణం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా సంతోషమని తెలిపారు. ఎందుకంటే గ్రామ సంఘాలకు ఇప్పటివరకు ప్రత్యేక భవనం లేక వివిధ ప్రభుత్వ భవనాలలో వారి సమావేశాలు నిర్వహించుకున్నారని తెలిపారు.
గ్రామ గ్రామానికి నూతన మహిళా సంఘం భవనం మంజూరుతో గ్రామ సంఘాల సభ్యుల కష్టాలు తీర్తున్నాయన్నారు.వదలపర్తి గ్రామానికి మహిళా సంఘం భవనం మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ,మాజీ సర్పంచ్ ప్రవీణ్ కుమార్,ఉప సర్పంచ్ కండె శ్యామల గంగారం, గ్రామ కార్యదర్శి అజ్ముద్దీన్, వార్డు మెంబర్లు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




