6 April, 2026 | 6:52 PM

బిజెపి కార్యాలయంలో జెండా ఎగురవేత

06-04-2026 05:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ జెండాను ఎగరవేశారు. బిజెపి 47వ వార్షికోత్సవ సందర్భంగా జెండాను ఎగురవేసి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నరేంద్ర మోడీ నాయకత్వంలో సంక్షేమ ఫలాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భూమయ్య అంజు కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు