6 April, 2026 | 7:26 PM

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న బిజెపి శ్రేణులు

06-04-2026 06:12 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగ కరీంనగర్ పట్టణం విద్యానగర్ 22వ డివిజన్లోని 367 బూతులో పశ్చిమ జోన్ మాజీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, శక్తి కేంద్రం ఇంచార్జ్, గుండారపు సంపత్ ఆధ్వర్యంలో పశ్చిమ జోన్  అధ్యక్షులు జాడిబాల్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ జన సంఘ పార్టీ నుండి ఏప్రిల్ 6 1980లో లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది.

రెండు పార్లమెంట్ సీట్లతో ప్రారంభమైన బిజెపి ప్రస్థానం ఒకసారి ప్రధానిగా వాజ్పేయి, నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ పరిపాలిస్తూ అనేక రాష్ట్రాలలో బిజెపి పరిపాలిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జోన్  కోశాధికారి ఖచ్చు మధు, అప్పాల శ్రీనివాస్, భగత్ సేన,ఈ రెడ్డి తిరుమలరెడ్డి, బొంగోని పరుశరాములు, విష్ణు ప్రసాద్ రావు, ఉదారపు విద్యాసాగర్, చందుగౌడ్,, దయ్యాల మల్లేశం, శీతాల రమేష్ చంద్ర, దేవదాసు రావు, తదితరులు పాల్గొన్నారు.