6 April, 2026 | 3:25 PM

ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

06-04-2026 01:28 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్ రావుతో కలిసి ధోని శ్రీశైలం పార్టీ జెండాను ఎగురవేసి బీజేపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలలో బీజేపీ ఒకటిగా ఎదిగి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

1980లో స్థాపితమైన భారతీయ జనతా పార్టీ దేశంలో జాతీయత, సాంస్కృతిక విలువల పరిరక్షణ, బలమైన జాతీయ రక్షణ వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రముఖ స్థానాన్ని సంపాదించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరభద్ర చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున యాదవ్, సొల్లు లక్ష్మి, కృష్ణ కుమారి, కేసరి ఆంజనేయులు గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మెరుగు శంకర్, ఆసిఫాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడు సుంకరి పెంటన్న, రుకుం ప్రహ్లాద్, కోట గొల్లయ్య,  వెంకన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.