ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు యోగా డే
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజశేఖర్ విద్యార్థుల చేత వివిధ రకాల ఆసనాలు,సూర్య నమస్కారాలు చేయించారు. ఈ సందర్బంగా వ్యాయామ ఉపాధ్యాయుడు రాజశేఖర్ మాట్లాడుతూ... అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21రోజున జరుగనుంది.
ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడం చేత ముందస్తుగా విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తూ వాటి ప్రయోజనాలు తెలిపారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు యోగా ద్వారా కీళ్ల నొప్పులు తగ్గడం, రక్తప్రసరణ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత వంటి ఆరోగ్య ప్రయోజనాలపై ప్రత్యేక విషయాలు విద్యార్థులకు వివరించారు. చదువు తో పాటు యోగా,క్రీడలలో ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






