16 March, 2026 | 8:59 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ఆరు గ్యారంటీల అమలు కోరుతూ బీజేపీ ధర్నా

16-03-2026 07:34 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భిక్కనూర్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ నాయకత్వంలో చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్‌ఐకి వినతిపత్రం అందజేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, గృహ నిర్మాణ పథకం తదితరాలను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదని వారు ఆరోపించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అత్తిల్లి తిరుమలేష్, రంజిత్, నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, యాదగిరి గౌడ్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.