మెల్లకుంట తండా బిఆర్ఎస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా బిఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నికను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య తెలిపారు. మండల ఎస్టీ సెల్ అధ్యక్షులుగా కొర్ర గోవింద్, గ్రామ కమిటీ అధ్యక్షులుగా అంగోత్ మోహన్, గ్రామ యూత్ ప్రెసిడెంట్ రమావత్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులుగా రమావత్ మోహన్, గౌరవ అధ్యక్షులు రమావత్ కిషన్, కార్యదర్శిగా ఆంగోత్ సూర్య, కోశాధికారిగా కుర్ర దేవుల, కోకన్వీనర్ రమావత్ నర్సింగ్, కార్యవర్గ సభ్యులుగా ఆంగోత్ దేవిసింగ్, రమావత్ గణేష్, దశరథ్, రవి, రాజు, రమావత్ నర్సింగ్ ఎన్నుకున్నట్లు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సభ్యులు బిఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం నడుచుకోవడం జరుగుతుందని, టిఆర్ఎస్ పార్టీ తరఫున చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో ముందుండి విజయవంతం చేస్తామన్నారు. గత పది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి రానున్న ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి, నాయకులు మిద్దె బాబురావు, దుందిగల్ నర్సింలు, బాల్య నాయక్, పేరుపల్లి సాయిబాబా, మహేందర్, విజయ్ కుమార్, పరమటి దుర్గేష్, తదితరులు పాల్గొన్నారు.




