16 March, 2026 | 9:00 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

16-03-2026 07:29 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని చెన్నాయిపాలెం గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో రెండవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నట్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స‌హ‌కారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నిలపనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చెన్నాయి పాలెం సర్పంచ్ భూక్యా రవీందర్ నాయక్, ఉప సర్పంచ్లు రాంబాయి నాగు నాయక్,నాగు నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాలోతు పున్నా నాయక్, వార్డు సభ్యులు భూక్యా గోవర్ధన్ నాయక్, బాణోతు నాగార్జున,బాణోతు క్రాంతి చిన్నా నాయక్, బానోతు బిందు శంకర్ నాయక్,మాజీ సర్పంచ్ భీముడు నాయక్, తులసి రామ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.