కూసుమంచి మండలంలో బీజేపీ సంబరాలు
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం కేంద్రంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచెర్రీ లో బీజేపీ ఘనవిజయం సాధించిన సందర్బంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆధ్వర్యంలో కూసుమంచిలో సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్ పంచి పంపిణి చేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకున్నారని, మమతా బెనర్జీ అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు బీజేపీని గెలిపించారని అన్నారు.
దేశంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో సోమవారం కూసుమంచి సెంటర్ వద్ద సంబరాలు నిర్వహించారు. బెంగాల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు. ఊహించిన దానికంటే భారీ సీట్లు కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మరియు జిల్లా బిజెపి నాయకులు పాల్గొన్నారు జిల్లా నాయకులు దాసరి వెంకటేశ్వర్లు బానోతు హత్యా నాయక్ మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ నాయక్ వడ్డెంపుల నరేష్ కూరపాటి నరేష్ కూరపాటి భాస్కర్ లక్ష్మయ్య ఉపేందర్ మధు తదర్లి కార్యక్రమంలో పాల్గొన్నారు






