1 September, 2026 | 10:07 PM

Breaking News

అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •   చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం   •   నేరేడుచర్ల పిహెచ్సిలో మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు   •  

రాష్ట్ర కార్యాలయంపై దాడిని ఖండించిన బీజేపీ శ్రేణులు

01-09-2026 | 07:00pm

మెట్ పల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని పిరికిపంద చర్యగా బీజేపీ పట్టణాధ్యక్షులు దొనికెల నవీన్(BJP city president Donikela Naveen) తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, ప్రజాస్వామ్య పరిరక్షణ(Protection of democracy) కోరుతూ ఆయన మాట్లాడారు.

ఎమర్జెన్సీ ముగిసి దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ(Congress Party) తన అరాచక ధోరణిని మార్చుకోలేదని మండిపడ్డారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్(Dr. B.R. Ambedkar) ప్రసాదించిన రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను కాలరాసేలా కాంగ్రెస్ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఖండనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను, ప్రతిపక్ష గొంతుకను అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్, పట్టణ ప్రధాన కార్యదర్శి జంగుల అనిల్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల జగదీశ్వర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, వైస్ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, కౌన్సిలర్లు పుడుకారం కిషోర్ రెడ్డి, బొడ్ల నాగేష్, ఉపాధ్యక్షులు కొయ్యల లక్ష్మణ్, భోగ దత్తాత్రి, ఐటీ సెల్ కన్వీనర్ పాసికంటి శ్రీనివాస్, సంకు ప్రసాద్, తల్లోజీ భాస్కర్, కళాలి రాజారెడ్డి, బొడ్ల అనిల్, సుంకే అశోక్, తోకల సత్యనారాయణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.