28 June, 2026 | 2:08 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

బైక్ దొంగ అరెస్ట్

03-02-2026 02:21 AM

మెదక్ టౌన్ సీఐ మహేష్

మెదక్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ద్విచక్ర వాహన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మెదక్ టౌన్ సీఐ మహేష్ కేసు వివరాలను వెల్లడించారు. నర్సిములు అనే వ్యక్తి పని నిమిత్తం మెదక్కు వచ్చి, ఆటో నగర్లోని వన దుర్గ భవాని వైన్స్ షాప్ ముందు తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేయగా, గుర్తు తెలియని వ్యక్తి బైక్ను దొంగిలించాడు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం బోధన్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో, ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం వచ్చి పట్టుకుని విచారించారు.

విచారణలో అతని పేరు కమ్మరి రాములుగా గుర్తించినట్లు తెలిపారు. విచారణలో అతడు పలు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడు గతంలో కూడా మెదక్, రామాయంపేట పరిసర ప్రాంతాల్లో అనేక ద్విచక్ర వాహన దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తుడని వెల్లడించారు. అతనిపై మెదక్, రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు ఆరు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి వద్ద నుండి మొత్తం మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.