28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొంగలకు బుద్ధి చెప్పాలి

03-02-2026 02:20 AM

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో బిజెపి బీఫారం లు అందజేత

జిన్నారం/ అమీన్ పూర్ ఫిబ్రవరి 2: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని బిజెపి కార్యాలయంలో సోమవారం ఉదయం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ చేవెళ్ల ,సీనియర్ నాయకులు నరేందర్ ఆధ్వర్యంలో మాదారం 10వ వార్డు టేక్మల్ల రాజు, 11వ వార్డు  చెరుకుల మల్లేష్ యాదవ్, 12వ వార్డు ఠాకూర్ వీర బాయ్,13వ వార్డు కుతాడి రమేష్   అభ్యర్థులకు బీఫారం లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభ్యర్థులకు మనోదైర్యం నింపారు. ఎలాంటి భయాలకు లొంగకుండా ఎన్నికల్లో దూసుకుపోవాలని సూచించారు.

కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, నరేంద్ర మోడీ పాలన పై ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. రమణ సింగ్ మాట్లాడుతూ... బీజేపీ అంటే నమ్మకం తెలిపారు. అవినీతి రహిత పాలన కొరకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ ఎక్కువ సంఖ్యలో కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవినీతి పై ప్రచారం చేయాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొంగలకు బుద్ది చెప్పాలని, బీజేపీని గెలిపించాలని కోరారు. అధ్యక్షుడు రాజు, రమణ సింగ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.