12 August, 2026 | 1:02 AM

అమెరికా కోర్టులో అదానీకి బిగ్ రిలీఫ్

12-08-2026 12:00 AM
  1. కేసు కొట్టివేతతో ముగిసిన చట్టపరమైన చర్యలు
  2. గ్లోబల్ బిజినెస్‌కు తొలగిన అడ్డంకులు
  3. ఇన్వెస్టర్లలో పెరిగిన నమ్మకం

న్యూయార్క్, ఆగస్టు ౧౧: భారత కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీపై ఉన్న కేసును అమెరికా కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనపై నమోదైన చట్టపరమైన చర్యలు ముగి శాయి. ఇకపై ఆయన వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇకపై ఆ కేసును ఎవరైనా తిరగదోడే అవకాశం లేదు. అలాగే, అమెరికాతో సహా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు.

అగ్రరాజ్య జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును ఉపసంహరించుకోవడంతో న్యాయస్థానమూ అందుకు అనుమతి ఇచ్చింది. కేసు ముగించే ముందు ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను సంప్రదించి ఉండాలని కోర్టు గతంలో అభిప్రాయపడింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తమ తప్పును తెలుసుకుని కేసును ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం చాలా కీలకమైన మార్పును తెస్తుంది. ఈ కేసు ప్రభావం భారత్‌లోని అదానీ వ్యాపారాలపై ఏమాత్రం పడలేదని మార్కెట్ విశ్లేష కులు పేర్కొన్నారు.

కేసులు నడుస్తున్న సమయంలోనూ ప్రాజెక్టులు, విస్తరణ పనులు కొనసాగాయి. కేసు కొట్టివేతపై గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. కేసు కొట్టివేతతో తమకు న్యాయంపై తమ నమ్మకం నిలిచిందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. క్రిమినల్ కేసు ముగిసినప్పటికీ ఇతర సివిల్ విషయాల్లో అదానీ సంస్థలు ముందస్తు ఒప్పందాలు చేసుకున్నాయి. 

సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ విచారణలో గౌత మ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్లు చెల్లించేందు కు అంగీకరించారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఇరాన్ ఆంక్షల వ్యవహారంలో 275 మిలియన్ డాల ర్లు చెల్లించేందుకు ఒప్పుకున్నది. 64 ఏళ్ల గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఇంధనం, ఓడరేవులు, విమానాశ్రయాల రం గాలలో భారీ వ్యాపారాలు నిర్వహిస్తున్నది.