12 August, 2026 | 2:19 AM

నా ఓటు గల్లంతు హాస్యాస్పదం

12-08-2026 12:00 AM

సినీనటుడు ప్రకాశ్‌రాజ్

బెంగళూరు, ఆగస్టు 11: బెంగళూర్‌లో నా ఓటు గల్లంతు కావడం హాస్యాస్పదంగా ఉందని సినీనటుడు ప్రకాశ్‌రాజ్ తెలిపారు. నియోజకవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో తనది కూడా ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఆయన ఓ సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. ‘సర్’ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో తొలగించిన 65లక్షల ఓట్లలో నాది కూడా ఉంది.

ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. నేను ఈ నియోజకవర్గంలోనే పుట్టాను. ఇక్కడే నివసించాను. చదువంతా ఇక్కడే. నటన నేర్చుకుంది కూడా ఇక్కడే. అన్నిటికంటే ముఖ్యంగా.. నేను ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేశా. అయినా నా ఓటును తొలగించారు’ అని ఆ స్పష్టం చేశారు. మళ్లీ ఓటర్‌కార్డు పొందడానికి ఏ డాక్యుమెంట్లు అడుగుతారో అని అన్నారు.