12 August, 2026 | 3:19 AM

ఫలహార బండి ఊరేగింపు

12-08-2026 01:00 AM

సికింద్రాబాద్, ఆగస్టు11 (విజయ క్రాంతి): ఆషాడ మాస బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి తొలి ప్రసాదంగా ఫలహారం బండిపై ఊరేగింపుతో ఆలయం చేరుకొని నైవేద్యం సమర్పించ డం సంప్రదాయామని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపా ధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు.

న్యూ బోయినపల్లి లోని బాపూజీనగర్ నల్లపోచమ్మ ఆలయ కమిటీ, బస్తిలోని యువజన సంఘం జైరామ్ వ్యాయమాశాల  ఆధ్వర్యంలో అమ్మవారి ఫలహర బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేసి ఫలహర బండ్ల ఊరేగింపును ప్రారంభించి పాల్గొన్నారు.