10 April, 2026 | 2:13 AM

అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

10-04-2026 12:31 AM

ఎర్రుపాలెం, ఏప్రిల్ 9 (విజయక్రాంతి):  ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం లో సాంఘిక గురుకుల పాఠశాల లో గురువారం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  విద్యార్థులకు ఉచితంగా సైకిలను అందజేశారు.

తదనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.  ప్రతి విద్యార్థి అక్షరమే ఆయుధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విద్యా సంవత్సరం నుండి జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం ప్రతి బిడ్డకు ఉచితంగా మంచి విద్య అందిస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణలో 100 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. విద్యార్థుల ఎదుగుదలే రాష్ట్ర ఎదుగుదల, వారి భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. అందుకే విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్లో విద్యాశాఖకు 13.5 శాతం నిధులు కేటాయించామన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామన్నారు.

విద్యార్థుల సమయాన్ని ఆదా చేసి, వారి శ్రమను తగ్గించేందుకు సైకిళ్లను అందజేస్తున్నాం.   ములుగుమాడు గ్రామం వద్ద రూ 36 . 50 కోట్లతో కట్టలేరు కెనాల్ కుడి ఎడమ కాలువల పనుల కోసం బట్టి విక్రమార్కశంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ, ప్రభుత్వ అధికారులు , అనధికారులు, మాజీ ఎమ్మెల్యే కొండబాల  కోటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చావా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.