25 February, 2026 | 5:03 AM

ద్వి సంప్రదాయ పెళ్లి!

25-02-2026 01:45 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మరికొ న్ని గంటల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారీ జంట. ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ పేరుతో తమ వివాహం జరగబోతున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమొంటోస్ రిసార్ట్స్ వివాహ వేడుకకు వేదిక కానుంది. మూడు రోజుల పాటు సాం ప్రదాయబద్దంగా ఈ ఈవెంట్‌ను పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించనున్నారు. సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. మంగళవారం మె హందీ, సంగీత్ కార్యక్రమాలతో వేడుకలు ఆరంభమ య్యాయి.

బుధవారం హల్దీ కార్యక్రమం నిర్వహించనున్నారు. 26న వివాహం జరగ నుంది. కేవలం 100 మంది అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక ల్లో పాల్గొనేందుకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ ఉదయ్‌పూర్ చేరుకున్నారు. 

ఫొటోలు వైరల్

తమ పెళ్లి వేడుకలకు సంబంధించి ప్రతి క్షణాన్ని విజయ్, రష్మిక జంట ఆస్వాదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ జంట నెట్టింట పంచుకున్న వేర్వేరు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ తన ఇన్‌స్టా స్టోరీలో స్విమ్మింగ్ పూల్‌లో వాలీబాల్ ఆడుతున్న ఫొటోను పంచుకు న్నారు. పూలూపండ్లతో అలంకరించిన డైనింగ్ టేబుల్‌పై ఉన్న డిన్నర్ మెనూ ఫొటోను రష్మిక షేర్ చేసింది. 

కొడవ సంప్రదాయంలోనూ వివాహ తంతు.. 

‘విరోష్’ వేడుక రెండు సంప్రదాయాల్లో జరగనున్నట్టు సమాచారం. ఫిబ్రవరి ఉదయం మొదట తెలుగు సంప్రదాయంలో పెళ్లి చేసుకోనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం కొడవ సంప్రదాయంనూ పెళ్లి తంతు జరగనుంది. అనంతరం హైదరాబాద్ చేరుకొని, మార్చి 4న రిసెప్షన్ ఏర్పాటుచేస్తారు. విజయ్ దేవరకొండది తెలంగాణ.

రష్మిక కర్ణాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కొడవ కమ్యూనిటీ సాధారణంగా చాతుర్వర్ణ (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) వ్యవస్థకు దూరంగా, ప్రత్యేక సంస్కృతి, ఆచారాలను కలిగి ఉంటుంది.  ఈ కారణంగానే రెండు సంప్రదాయాల్లో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఏదేమైనా ‘విరోష్’ వేడుక రెండు సంప్రదాయాల సమ్మిళితంగా జరగడం ప్రత్యేకతగా నిలవనుంది.