18 August, 2026 | 3:32 AM

కోటగుళ్లలో భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ పూజలు

18-08-2026 12:26 AM

గణపురం ఆగస్టు17 (విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో సోమవారం భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంది వార్షికోత్సవంతో పాటు నాగుల పంచమి పర్వదినం సందర్భంగా సిఐ నందీశ్వరునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు