ఖానాపూర్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
28-08-2026 04:02 PM
రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో అండగా ఉంటానని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య ఝాన్సన్ నాయక్ అన్నారు. రాఖీ పండుగ(Rakhi festival) సందర్భంగా శుక్రవారం ఖానాపూర్ లోని కార్యాలయంలో పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బంజారా, నియోజకవర్గ మహిళలు పలువురు జాన్సన్ నాయక్ కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల కష్టసుఖాల్లో తాను అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళలు తలారి భాగ్యలక్ష్మి, గురిజాల రామ, రాచకొండ స్వప్న, యమునూరు జ్యోతి ,పలువురు ప్రజాపతినిధులు ఆయనకు రాకి కట్టారు.






