28 August, 2026 | 5:14 PM

30న జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలు

28-08-2026 04:00 PM

పోటీలకు ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

యూనిటీ గోల్డ్స్ జిమ్ నిర్వాహకులు ఎండి.నూర్,ఎండి.జాకీర్,ఎండి.అమీర్ ఖాన్,ఎస్.కె.సల్మాన్ 

పాల్వంచ, ఆగస్టు 28, (విజయక్రాంతి): ఈనెల 30వ తేదీన యూనిటీ గోల్డ్స్ జిమ్ ఆధ్వర్యంలో పాల్వంచ ఇంజనీరింగ్ అసోసియేషన్ హాల్ నందు జిల్లా స్థాయి ఎంకరేజ్ మెంట్ బెంచ్ ప్రెస్ పోటీలను నిర్వహిస్తున్నట్టు,ఈ పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రోహిత్ రాజ్ హాజరు కానున్నట్టు యూనిటీ గోల్డ్స్ జిమ్ నిర్వాహకులు ఎం.డి నూర్,ఎండి.జాకీర్,ఎండి.అమీర్ ఖాన్, ఎస్.కె.సల్మాన్ తెలిపారు.

శుక్రవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో పాల్వంచ పట్టణంలో మొట్టమొదటి సారి జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలను సబ్ జూనియర్స్,జూనియర్స్,సీనియర్స్,మాస్టర్స్ గా మొత్తం 9వెయిట్ కేటగిరీలలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు పోటీలను ప్రారంభించనున్నట్టు,జిల్లా లోని జిమ్ నిర్వాహకులు,క్రీడాకారులు   వయస్సు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు తీసుకొని ఉదయం 8 గంటల కల్లా ఇంజనీరింగ్ అసోసియేషన్ హాల్ ప్రాంగణానికి చేరుకొని పోటీలు విజయవంతం చేసేందుకు  సహకరించాలని కోరారు.