ఆలేరులో విద్యుత్ అమరవీరులకు ఘన నివాళి
28-08-2026 06:04 PM
ఆలేరు: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా 2000లో జరిగిన ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌లకు విప్లవ, వామపక్ష పార్టీల నేతలు ఘన నివాళులర్పించారు. శుక్రవారం ఆలేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, సీపీఎం సీనియర్ నాయకుడు మొరిగాడి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీల పెంపు, కేంద్ర విద్యుత్ సంస్కరణలు, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్, ఐఎఫ్‌టీయూ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.






