నేటి నుంచే ‘భూ భారతి’ అమలు
- పైలెట్ ప్రాజెక్టుగా ఐదు మండలాల ఎంపిక
- ప్రతి సర్వే నంబరుకు భూధార్
రంగారెడ్డి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత పారదర్శకంగా, సులభతరం చేసేందుకు ప్రభుత్వం సమీకృత భూ భారతి పోర్టల్ ను ఏప్రిల్ 2 నుంచి అందుబాటులోకి తీ సుకువస్తోంది. ఇందుకు రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లు, ఖమ్మం జిల్లా కూసు మంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నా రాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
రైతులు భూ సేవల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఇం టి నుంచే సేవలు పొందేలా ఈ పోర్టల్ను రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, ఎన్‌ఐసీ విభాగాలన్నీ ఇకపై ఒకే గొడుగు కిందికి రానున్నాయి. ఆధా ర్ తరహాలోనే ప్రతి భూ కమతానికి (సర్వే నంబర్) ఒక ప్రత్యేకమైన భూధార్ నంబర్‌ను కేటాయిస్తారు.
ఆధార్‌తో అ నుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయితే భూమి విస్తీర్ణం, యజమాని పేరు, హద్దులు, మ్యాప్ వంటి వివరాలన్నీ డిజిటల్ రూపంలో కనిపిస్తాయి. ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, పట్టా భూములకు పక్కాగా హద్దు లు నిర్ణయించడం ద్వారా సరిహద్దు తగాదాలకు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల సమస్యలకు చెక్ పడనుంది.
అమనగల్లులో ప్రస్తుత పరిస్థితి
అమనగల్లు మండలంలో ఇప్పటివరకు 6,585 దరఖాస్తులు అందగా, అందులో 3,089 పరిష్కారమయ్యాయి. మిగిలిన పెండింగ్ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, త్వరలోనే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. అవినీతికి తావులేకుం డా, రైతులకు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పించడమే ప్రధాన ఉద్దేశం అని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.




