13 May, 2026 | 11:14 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

భీమేశ్వర స్వామి ఆలయం భక్తుల మొక్కుబడి సేవలు

22-11-2025 10:16 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మొక్కుబడి సేవలు ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి నిర్వహించబడుతున్నాయి. ఆది, సోమవారం వంటి భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయి.

అలాగే భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదాన సత్రం పైభాగంలో ఉన్న నిత్య కళ్యాణ మండపంలో  నిర్వహించబడుతుంది. భక్తులు ఈ సేవలను వినియోగించుకుని స్వామివారి సేవలు చెల్లించుకోవచ్చు.‌ ఇక భీమేశ్వర ఆలయంలో  పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీదేవి–భూదేవి సహిత అనంత పద్మనాభ స్వామి,  ఉత్సవమూర్తులపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ సేవలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ ఆలయ అర్చకులు వేద పండితులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.