27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

కీసరగుట్టలో భారతి మహాస్వామి దర్శనం

03-11-2025 02:49 AM

కీసర , నవంబర్ 2(విజయక్రాంతి): కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవానీ శివ దుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారిని శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీ విధూశేఖర భారతి మహాస్వామి ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగద్గురు విధూశేఖర భారతి మహాస్వామి గర్భగుడిలో కొలువై ఉన్న రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పూజల అనంతరం భక్తులను ఉద్దేశించి స్వామివారు ప్రవచనాలు వినిపించారు. ధర్మం, వేదాల ప్రాముఖ్యత, మానవ జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్భంగా స్వామివారు గతంలో కీసరగుట్టలోని వేద పాఠశాలలో విద్యనభ్యసించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.స్వామివారి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  జగద్గురువుల ఆశీర్వాదం తీసుకుని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారిలు పాల్గొన్నారు