24 February, 2026 | 6:40 PM

చికిత్సలకు మెరుగైన మౌలిక వసతులు అవసరం

24-02-2026 12:28 AM

నందమూరి బాలకృష్ణ

బంజారాహిల్స్,ఫిబ్రవరి 23(విజయక్రాంతి): సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మెరుగైన క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తోందని సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. హాస్పిటల్ లో నవీకరించబ డిన ఆరోగ్యశ్రీ వార్డులను, అత్యాధునిక ఎండోస్కోపీ పరికరాలను సోమవారం ప్రారంభిం చారు.

కియా ఇండియా సామాజిక బాధ్యత నిధులతో పునరుద్ధరించబడిన 24 పేషెంట్ రూములను రోగులకు అంకితం చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించిన ఆర్థిక సహాయంతో కొనుగోలు చేసిన అధునాతన గ్యాస్ట్రో, కోలోనో వీడియోస్కోప్ సౌకర్యాలను బాలకృష్ణ ప్రారంభిం చారు.

కియా ఇండియా ప్రతినిధులు, ఐఓసిఎల్ ఉన్నతాధికారులతో పాటు బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు సభ్యులు జె.ఎస్.ఆర్ ప్రసాద్, సీఈఓ డాక్టర్ కృష్ణయ్య, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎస్.రావు పాల్గొన్నారు.