ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నగర పౌరుల సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ మాదాపూర్ సీఎం సీ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాల యాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు సమర్పించారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా నిర్వహిం చిన ప్రజావాణికి మొత్తం 59 ఫిర్యాదులు వచ్చాయి.
బల్దియా ప్రధాన కార్యాలయంలో 42 విన్నపాలు రాగా.. మిగిలిన ఆరు జోన్ల పరిధిలో 17 అర్జీలు నమోదయ్యాయి. జీహెచ్‌ఎం సీ హెడ్ ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కే. సత్యనారాయణ, ఏఎ స్పీ నరసింహారెడ్డి, జాయింట్ కమిషనర్లు జయంత్, రజనీకాంత్ రెడ్డి, సిటీ ప్లానర్ ఉమ తదితరులు పాల్గొని ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు.
సమస్యలను సంబంధిత విభాగాలకు పంపి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాదాపూర్లోని సీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమానికి ప్రజల నుంచి 43 విన్నపాలు, ఫిర్యాదులు అందాయి. మరోవైపు మల్కాజిగిరి నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసా గింది. ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డితో పాటు అన్ని విభాగాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ 25 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.




