బెథెల్ ధనాధన్
- ఇంగ్లాండ్‌దే రెండో టీ20
- కొంపముంచిన రవిబిష్ణోయ్
- గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్
170కి పైగా స్కోరు చేయడం కష్టమే అనుకున్నారు. తిలక్ వర్మ మెరుపులతో 191 టార్దెట్‌ను ప్రత్యర్థి ముందుంచింది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు ఔట్.. ఇంకేముం ది గెలిచినట్టేనని భావించారు. మధ్యలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా చివర్లో బిష్ణో య్ వేసిన ఓవర్ కొంపముంచింది. ఫలితంగా భారత్ గెలిచే మ్యాచ్‌లో ఓడింది.
మాంచెస్టర్, జూలై 4 : భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో మెరుగ్గానే రాణించినా బౌలింగ్‌లో నిరాశపరచడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో 29 పరుగులు ఇవ్వడం కొంపముంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటిం గ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశా డు.
15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పిన్న వ యస్కుడిగా రికార్డులకెక్కాడు. వైభవ్ ఎంట్రీతో సంజూ శాంసన్ పై వేటు పడింది. రెండు భారీ సిక్స ర్లు బాదినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఓపెనర్లు తొలి వికెట్ కు 50 పరుగులు జోడించారు. 24 బంతుల్లోనే 43 (8 ఫోర్లు, 1 సిక్స ర్) పరుగులు చేసాడు. వైభవ్ ఔటైనా.. అభిషేక్ శర్మ తన జోరును కొనసాగించాడు. హా ఫ్ సెంచరీ దిశగా సాగిన అతన్ని పవర్ ప్లే లోని చివరి బంతికి రన్ ఔట్ చేశాడు. దాం తో భారత్ పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ముందు కు నడిపించారు.
ఇషాన్ కిషవ్ 40 బంతు ల్లో 6 ఫోర్లతో 49, శ్రేయాస్ అయ్యర్ 22 బంతుల్లో 37 (3 ఫోర్లు, 1 సిక్సర్ ) రాణించాడు. అయితే చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ తర్వాత అక్షర్ పటేల్, హర్షిత్ రాణా వెంటవెంటనే వెనుదిరగడంతో 170 పరుగులైనా చేస్తుందా అని పించింది. ఈ దశలో తిలక్ వర్మ మెరుపులు మెరిపించి స్కోరును 190కి చేర్చాడు. ఇం గ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఛేజింగ్‌లో ఇంగ్లాండ్‌కు తొలి ఓవర్లోనే అర్షదీప్ సింగ్ షాకిచ్చాడు.
బట్లర్, ఫిల్ సాల్ట్‌లను డకౌట్‌గా పెవిలియన్ కు పంపాడు. ఈ దశలో హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్ మెరుపులు మెరిపించారు. బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగు లు చేశాడు. బ్రూక్, బెథెల్ 50 పరుగు లు జోడించారు. అటు బాంటన్‌తో కూడా బ్రూక్ 67 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో విల్ జాక్స్, సామ్ కరన్ ఔటైనా బెథెల్ ఇంగ్లాండ్ విజయాన్ని పూర్తి చేశాడు. నిజానికి రవిబిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ భారత్ కొంపముంచింది.
ఆ ఓ వర్లో బిష్ణోయ్ 2 నోబాల్స్, 3 సిక్సర్లతో సహా 29 పరుగులు సమర్పించుకున్నాడు.ఈ క్ర మంలో బెథెల్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. మరో ఓవర్ మిగిలుండగానే ఇంగ్లాండ్ టార్గెట్‌ను అందు కుంది. బెథెల్ 46 బంతుల్లో 76 (5 ఫోర్లు, 5 సిక్సర్లు) రన్స్ త నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో 1--- ఆధిక్యంలో నిలిచింది.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 190/7 ( అభిషేక్ శర్మ 43, ఇషాన్ కిషన్ 49, శ్రేయాస్ అయ్యర్ 37, తిలక్ వర్మ 24 ; సామ్ కరన్ 3/33, విల్ జాక్స్ 1/27)
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 191/6 ( బెథెల్ 76 నాటౌట్, బాంటన్ 39, బ్రూక్ 39 ; అర్షదీప్ సింగ్ 3/40, అక్షర్ పటేల్ 1/20 )






