5 July, 2026 | 2:09 AM

చాంపియన్ ఎవరో ?

05-07-2026 12:24 AM
  1. ఫైనల్‌కు ఆసీస్, ఇంగ్లాండ్ రెడీ
  2. మహిళల టీ20 ప్రపంచకప్

లార్డ్స్, జూలై 4 : మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది.చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, ఇం గ్లాండ్ తలపడబోతున్నాయి. రెండు జట్లు కూడా టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుం డా ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో ఈ మ్యా చ్‌ను సమఉజ్జీల సమరంగా అభివర్ణిస్తున్నా రు. బలాబలాల పరంగానూ ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయమని అంచనా వేస్తున్నా రు. ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాను ఫేవరెట్‌గా చెబుతున్నారు. ఎందుకంటే మెగాటో ర్నీలో ఆ జట్టుకు తిరుగులేని రికారు ఉంది. ఆరుసార్లు ప్రపంచకప్ గెలిచిన కంగారూ లు ఎనిమిదో సారి ఫైనల్ ఆడబోతున్నా రు.

ఐసీసీ ఫైనల్స్‌లో ఉండే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్నది ఆసీస్‌కు బాగా తెలు సు.  బ్యాటింగ్ లైనప్‌లో బెత్ మూనీ, అ లైసా హీలీ, గార్డనర్, ఎలీస్ పెర్రీ కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగం లోనూ ఆసీస్ బలంగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్‌ను కూడా తక్కువ అంచ నా పరిస్థితి లేదు. ఆ జట్టు కూడా అజేయంగానే ఫైనల్‌కు చేరింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇం గ్లాండ్ మంచి ఫామ్ లో ఉంది. వ్యాట్-హోడ్జ్, నాట్ సైవర్-బ్రంట్, హీథర్ నైట్ వంటి స్టార్ బ్యాట ర్లు రాణిస్తున్నారు. సొంతగడ్డపై మ్యాచ్ కావడంతో ఇంగ్లాండ్ జట్టుకు లార్డ్స్ పరిస్థితుల పై పూర్తి అవగాహన ఉంది. ఇంగ్లాండ్ గెలిస్తే రెండోసారి వరల్ కప్‌ను సొంతం చేసుకుంటుంది. ఆసీస్ విజయం సాధిస్తే ఏడోసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడుతుంది. గత రికార్డుల్లో ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 45 సార్లు తలపడితే ఆస్ట్రేలియా 22 సార్లు, ఇంగ్లాండ్ 20 సార్లు గెలిచాయి.