2 July, 2026 | 10:46 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

జవాబుదారీతనంతో ఉత్తమ సేవలు అందించాలి

02-07-2026 12:00 AM

కలెక్టర్ ప్రతిమాసింగ్ 

మెదక్, జులై 1 (విజయక్రాంతి): పారదర్శకత రెవిన్యూ పాలనే లక్ష్యంగా జవాబుదారి తనంతో వ్యవహరించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తహ సిల్దారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, నర్సాపూర్ తూప్రాన్ ఆర్డీవోలు అన్ని మండలాల  తహసీల్దార్లతో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి దరఖాస్తులు, రెవిన్యూ పాలనపై  కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

డివిజన్లు, మండలాల వారీగా భూ భారతి, సాదా బైనామా దరఖాస్తుల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూ భారతి పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని. పట్టాదారు పాస్ పుస్తకాలు, నమోదైన వివరాలు, వారసత్వ హక్కుల నమోదు, సర్వే నంబర్ల వారిగా భూ వివరాల ధృవీకరణ తదితర నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

భూ భారతి కార్యక్రమం అమలు పురోగతి, భూ రికార్డుల పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వ అవసరాలకు, అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణలో నిబంధనలు పాటిస్తూ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తులను జాప్యం చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత పత్రాలు, ఆధారాలు, గ్రామ పత్రాలు ఆధారంగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా  పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత తాసిల్దారులు పాల్గొన్నారు.